Raghu Rama Krishna Raju: పేపర్, ఛానల్ పెట్టుకునే పనిలో ఉన్నారా?: విజయసాయిపై రఘురామకృష్ణరాజు సెటైర్లు

Why Vijayasai Reddy did not come for Visakha Gharjana asks Raghu Rama Krishna Raju
  • విశాఖ గర్జనకు రాని విజయసాయిరెడ్డి
  • ఎందుకు రాలేదని ప్రశ్నించిన రఘురామకృష్ణరాజు
  • వివేకా హత్య కేసును తేల్చలేని స్థితిలో జగన్ ఉన్నారని విమర్శ
విశాఖలో జరిగిన విశాఖ గర్జనకు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఎందుకు రాలేదని ఆ పార్టీ రెబెల్ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. పేపర్, ఛానల్ పెట్టుకునే పనిలో విజయసాయి ఉన్నారా? అని ప్రశ్నించారు. విశాఖ గర్జన సభ ఫెయిలయిందని అన్నారు. వైసీపీ నేతలు డబ్బాలు కొట్టుకోవడానికే ఇది పరిమితమయిందని చెప్పారు. 

అమరావతి రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అనడం సరికాదని అన్నారు. కాళ్లు అరిగేలా నడుస్తున్న వారిని అలా అనడం కరెక్ట్ కాదని చెప్పారు. మూడు రాజధానులను అభివృద్ధి చేస్తామంటున్న జగన్... రాష్ట్రంలో కనీసం రోడ్డు కూడా వేయలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. సొంత బాబాయ్ వివేకా హత్య కేసును కూడా తేల్చలేని పరిస్థితిలో జగన్ ఉన్నారని... ఆయన చర్యలు ప్రజలకు అనుమానాలు కలిగేలా ఉన్నాయని చెప్పారు.
Raghu Rama Krishna Raju
Vijayasai Reddy
YSRCP

More Telugu News