YSRCP: నాపై నేనే సీబీఐ విచార‌ణ కోర‌తా... అందుకు మీరూ సిద్ధ‌మేనా?: వైసీపీ ఎమ్మెల్యే శివ‌ప్ర‌సాద్ రెడ్డి

ysrcp mla sva prasada reddy vral challenge to tdp leaders
  • ప్రొద్ద‌టూరులో టీడీపీ నేత ఇంటిని ముట్ట‌డించిన పొదుపు మ‌హిళ‌లు
  • ఈ వ్య‌వ‌హారంపై రాచ‌మ‌ల్లుపై ఆరోప‌ణ‌లు గుప్పించిన లోకేశ్, అచ్చెన్న‌,సోమిరెడ్డి
  • టీడీపీ నేత‌ల ఆరోప‌ణ‌ల‌పై ప్ర‌తిస్పందించిన వైసీపీ ఎమ్మెల్యే
ఏపీలో అధికార పార్టీకి చెందిన క‌డ‌ప జిల్లా ప్రొద్ద‌టూరు ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్ రెడ్డి విప‌క్ష టీడీపీ నేత‌ల‌కు శ‌నివారం ఓ స‌వాల్ విసిరారు. త‌నపై తానే సీబీఐ విచార‌ణ కోర‌బోతున్నాన‌ని చెప్పిన శివ‌ప్ర‌సాద్ రెడ్డి... త‌న‌పై ఆరోప‌ణ‌లు చేసిన టీడీపీ నేత‌లు నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డిలు కూడా అందుకు సిద్ధ‌మేనా? అని ఆయ‌న స‌వాల్ విసిరారు. తాను అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డ‌ట్టుగా ఇటీవ‌ల లోకేశ్, అచ్చెన్న‌, సోమిరెడ్డి చేసిన ఆరోప‌ణ‌ల‌పై స్పందించిన సంద‌ర్భంగా శివ‌ప్ర‌సాద్ రెడ్డి ఈ స‌వాల్ విసిరారు.

ఇటీవ‌లే ప్రొద్ద‌టూరులో ఓ మహిళ పొదుపు సంఘాల‌కు చెందిన మ‌హిళ‌ల వ‌ద్ద అక్ర‌మంగా వ‌సూళ్లు చేప‌డితే... ఆమెకు స్థానిక టీడీపీ నేత మ‌ద్ద‌తు ప‌లికార‌ని ఆరోపిస్తూ... టీడీపీ నేత ఇంటిని బాధిత మ‌హిళ‌లు ముట్ట‌డించిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యంపై స‌ద‌రు టీడీపీ నేత‌ను వెన‌కేసుకుని వ‌చ్చిన లోకేశ్‌, అచ్చెన్న‌, సోమిరెడ్డిలు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న‌ శివ‌ప్ర‌సాద్ రెడ్డిపై ఆరోప‌ణ‌లు గుప్పించారు. 

ఈ ఆరోప‌ణ‌ల‌పై ప్ర‌తిస్పందించిన శివ‌ప్ర‌సాద్ రెడ్డి... త‌న రాజ‌కీయ జీవితంలో ఏనాడూ దౌర్జ‌న్యాలు, అక్ర‌మాల‌కు పాల్ప‌డ‌లేద‌ని చెప్పారు. ఈ విష‌యాన్ని ద‌మ్ముంటే నిరూపించాల‌ని ఆయ‌న టీడీపీ నేత‌ల‌కు స‌వాల్ విసిరారు. టీడీపీ నేత‌ల‌తో ఆ ప‌ని కాకుంటే... తానే స్వ‌యంగా త‌న‌పైనే సీబీఐ విచార‌ణ‌కు కోర‌తాన‌న్న శివప్ర‌సాద్ రెడ్డి...త‌న‌పై ఆరోప‌ణ‌లు గుప్పించిన నేత‌లు కూడా త‌న మాదిరిగానే సీబీఐ విచార‌ణ కోర‌గ‌ల‌రా? అని ఆయ‌న ప్రశ్నించారు.
YSRCP
Kadapa District
Rachamallu Siva Prasada Reddy
TDP
Proddatur
Nara Lokesh
Atchannaidu
Somireddy Chandra Mohan Reddy

More Telugu News