భార్యలు ఎంత మంది ఉన్నా గౌరవిస్తాం.. మరి హిందువులు?: యూపీ ఎంఐఎం నేత వివాదాస్పద వ్యాఖ్యలు
- ఇద్దరు భార్యలున్నా సమాజంలో సుముచిత స్థానం కల్పిస్తామన్న షౌకత్ అలీ
- పిల్లలు అందరి పేర్లు రేషన్ కార్డులో చేరుస్తామని వెల్లడి
- హిందువులు ఒక్కరికీ గౌరవం ఇవ్వరని విమర్శ
హిజాబ్ అంశంపై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం రెండు వేర్వేరు తీర్పులు ఇవ్వడంపైనా షౌకత్ అలీ మాట్లాడారు. 'ఈ దేశంలో ఎవరు ఏది ధరించాలో హిందుత్వ కాదు నిర్ణయించాల్సింది. రాజ్యాంగం ఆ పని చేయాలి. ఈ తరహా అంశాలను లేవనెత్తడం ద్వారా బీజేపీ దేశాన్ని విభజించాలని చూస్తోంది’’అని షౌకత్ అలీ అన్నారు.