వైసీపీకి గెడ్డపువలస సర్పంచ్ సూరి నాయుడు రాజీనామా
- వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్న సూరి నాయుడు
- రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన జరుగుతోందని ఆరోపణ
- దేవాడ మైనింగ్ బ్లాక్‌లో 200 ఎకరాలను కడప రెడ్లకు కట్టబెడుతున్నారని ఆరోపణ
- త్వరలో జనసేనలో చేరుతున్నట్లు ప్రకటన
వైసీపీకి రాజీనామా చేసిన సందర్భంగా సూరి నాయుడు జగన్ పాలనపై ఆరోపణలు చేశారు. చీపురుపల్లి నియోజకవర్గంలో దేవాడ మైనింగ్ బ్లాక్‌లో సుమారు 200 ఎకరాలను కడప రెడ్లకు అక్రమంగా కట్టబెడుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ భూముల విలువ దాదాపుగా రూ.3 వేల కోట్లకు పైగా ఉంటుందని కూడా ఆయన తెలిపారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన జరుగుతోందని, ఆ పాలనకు నిరసనగానే తాను వైసీపీకి రాజీనామా చేస్తున్నానని తెలిపారు. త్వరలోనే తాను జనసేనలో చేరనున్నట్లు సూరి నాయుడు ప్రకటించారు.