YSRCP: టీచ‌రుగా మారిన వైసీపీ ఎమ్మెల్యే... ఫొటోలు ఇవిగో

yscrp mla chevireddy bhaskar reddy teaches a lesson to mpp school children
  • చంద్ర‌గిరి ఎమ్మెల్యేగా కొన‌సాగుతున్న చెవిరెడ్డి
  • పాకాల మండ‌లం ర‌మ‌ణ‌య్యగారి ప‌ల్లి వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యే
  • విద్యార్థుల‌కు పాఠం చెప్పిన వైనం
వైసీపీ కీల‌క నేత‌, తిరుప‌తి జిల్లా చంద్ర‌గిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర రెడ్ది ఏది చేసినా ప్ర‌త్యేకంగానే ఉంటుంది. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో నిత్యం ఏదో ఒక కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టే చెవిరెడ్డి... నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోనే ఎక్కువ స‌మ‌యం గ‌డుపుతుంటారు. వృత్తిరీత్యా రాజ‌కీయ నేత‌గా ఉన్నా... విద్యాభ్యాసంలో మాత్రం చెవిరెడ్డికి ఇప్ప‌టికీ తృష్ణ తీర‌లేద‌నే చెప్పాలి. రాజ‌కీయాల్లోకి రాక‌ముందే ప‌లు స‌బ్జెక్టులలో మాస్ట‌ర్స్ డిగ్రీలు అందుకున్న చెవిరెడ్డి... న్యాయ శాస్త్రాన్ని కూడా చ‌దివారు.

తాజాగా శుక్ర‌వారం చెవిరెడ్డి ఉపాధ్యాయుడి అవ‌తారం ఎత్తారు. త‌న నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని పాకాల మండ‌లం  రమణయ్యగారి పల్లి గ్రామం వెళ్లిన చెవిరెడ్డి... గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు వెళ్లారు. ఓ త‌ర‌గతి గ‌దికి వెళ్లిన చెవిరెడ్డి అక్క‌డి విద్యార్థుల‌కు పాఠాలు చెప్పారు. ఓ త‌ర్ఫీదు పొందిన ఉపాధ్యాయుడి మాదిర‌గా చాక్‌పీస్ తీసుకుని బ్లాక్ బోర్డుపై అక్ష‌రాలు రాస్తూ ఆయ‌న చెప్పిన పాఠాన్ని విద్యార్థులు ఆస‌క్తిగా విన్నారు.
YSRCP
Chevireddy Bhaskar Reddy
Chandragiri MLA
Pakala

More Telugu News