సంక్రాంతికి బరిలోకి దిగుతున్న 'వాల్తేరు వీరయ్య'
- చిరూ 154వ సినిమాగా 'వాల్తేరు వీరయ్య'
- ముగింపు దశలో ఉన్న చిత్రీకరణ
- కథానాయికగా శ్రుతి హాసన్
- సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్
ఈ సినిమాలో చిరంజీవి మాస్ లుక్ తో కనిపించనున్నారు. ఆయన యాస .. డైలాగ్ డెలివరీ .. లుక్ డిఫరెంట్ గా ఉండనున్నాయి. ఇటీవల కాలంలో ఈ సినిమా నుంచి ఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో, ఈ సినిమా సంక్రాంతికి రాకపోవచ్చనే ప్రచారం ఊపందుకుంది. వచ్చే వేసవిలో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారనే వార్తలు షికారు చేస్తున్నాయి.
అయితే తాజాగా ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు మొదలైనట్టుగా మేకర్స్ అప్ డేట్ వదిలారు. సాధారణంగా చిత్రీకరణ ముగింపు దశకి చేరుకున్న తరువాతనే డబ్బింగ్ కార్యక్రమాన్ని మొదలుపెడుతూ ఉంటారు. అందువలన ఈ సినిమా సంక్రాంతి బరిలోకి దిగడం ఖాయమనే విషయాన్ని చెప్పకనే చెప్పినట్టు అయింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాలో కథానాయికగా శ్రుతి హాసన్ అలరించనుంది