చంద్రబాబుపై విమర్శలు ఆపకపోతే కొడాలి నానిని ప్రజలు పోస్టుమార్టం చేస్తారు: బుద్ధా వెంకన్న
- నిన్న కొడాలి నాని ప్రెస్ మీట్
- చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు
- వార్నింగ్ ఇచ్చిన బుద్ధా వెంకన్న
- కొడాలి నాని గురించి కొన్ని విషయాలు బయటపెడతానని వెల్లడి
చంద్రబాబుపై కొడాలి నాని అనవసర విమర్శలు మానుకోవాలని హెచ్చరించారు. లేకపోతే కొడాలి నానిని పోస్టుమార్టం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. హరికృష్ణ, వైఎస్సార్ లలో ఎవరు గొప్ప అంటే నాని ఏం సమాధానం చెబుతారని బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. వైఎస్సార్ చనిపోయినప్పుడు కొడాలి నాని తదితరులు ఏంచేశారో త్వరలోనే బయటపెడతానని వెల్లడించారు.