ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా నదిపై వెయ్యి కోట్లతో ఐకానిక్ వంతెన
- రూ.1,082.56 వ్యయంతో కేబుల్ బ్రిడ్జి
- కేంద్రం ఆమోదం తెలిపిందన్న నితిన్ గడ్కరీ
- 30 నెలల్లో పూర్తవుతుందని వెల్లడి
- ప్రముఖ పర్యాటక కేంద్రం అవుతుందని ఆశాభావం
విశాలమైన శ్రీశైలం జలాశయానికి చేరువగా, నల్లమల అడవి, ఎత్తయిన కొండల మధ్య నిర్మించే ఈ వంతెన పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుందని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. తెలంగాణ వైపున లలితా సోమేశ్వర ఆలయం, ఏపీ వైపున సంగమేశ్వర ఆలయంతో ఇదొక ఆకర్షణీయ కేంద్రంగా మారుతుందని వివరించారు.