ఒంగోలులో దారుణం: ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వివాహితను ఢీకొట్టి.. అత్యాచారం
- రాత్రి పదిన్నర సమయంలో ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్న మహిళ
- నిర్మానుష్య ప్రదేశంలో ఆమె వాహనాన్ని ఢీకొట్టిన నిందితులు
- కిందపడగానే పక్కనే ఉన్న పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారం
- చేపల చెరువుల వద్ద కాపలాగా పనిచేస్తున్న యువకులే నిందితులని గుర్తించిన పోలీసులు
రాత్రి పొద్దుపోతున్నా మహిళ ఇంటికి చేరకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆమెను వెతుక్కుంటూ బయలుదేరారు. ఈ క్రమంలో ఆమె మధ్యలో తారసపడింది. జరిగిన విషయం వారికి చెప్పింది. దీంతో వారు నిందితుల కోసం గాలించారు. ఈ క్రమంలో కొత్తపట్నం రోడ్డులోని ఓ పెట్రోలు బంకు వద్ద నిందితులు కనిపించారు. వారిని పట్టుకునే లోపే అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో వారు తర్వాతి రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు కొప్పోలు సమీపంలోని చేపల చెరువుల వద్ద కాపలాదారులుగా పనిచేస్తున్నఇద్దరు యువకులే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు గుర్తించారు. వారి కోసం గాలిస్తున్నారు.