Tamil Nadu: ప్రేమను నిరాకరించిందని.. యువతిని రైలు కిందకు తోసేసిన యువకుడు

young man pushed the student in front of the moving train died
  • చెన్నైలోని సెయింట్ థామస్ మౌంట్ రైల్వే స్టేషన్‌లో ఘటన
  • రైల్వే స్టేషన్‌లోనే యువతితో వాదులాటకు దిగిన యువకుడు
  • నిరాకరించడంతో పట్టాలపైకి తోసి హత్య
తన ప్రేమను నిరాకరించిందన్న కారణంతో ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. యువతిని రైలు కిందికి తోసి హతమార్చాడు. తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగిందీ ఘటన. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. అదంబాక్కానికి చెందిన సత్య (20) టీనగర్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో బీకాం సెకండియర్ చదువుతోంది. అదంబాక్కానికే చెందిన సతీశ్ (23) ప్రేమిస్తున్నానంటూ ఆమె వెంటపడేవాడు. అందుకు ఆమె అంగీకరించలేదు. తన ప్రేమను నిరాకరించిన ఆమెపై సతీశ్ కోపం పెంచుకున్నాడు. 

ఈ క్రమంలో గురువారం సత్య కళాశాలకు వెళ్లేందుకు సెయింట్ థామస్ మౌంట్ రైల్వే స్టేషన్‌కు చేరుకుని రైలు కోసం ఎదురుచూస్తోంది. అదే సమయంలో అక్కడికి చేరుకున్న సతీశ్ తన ప్రేమ విషయంలో ఆమెతో అక్కడే వాదులాటకు దిగాడు. అయినప్పటికీ ఆమె ససేమిరా అనడంతో ఆగ్రహంతో ఊగిపోతూ ప్లాట్‌పామ్ నుంచి రైలు పట్టాలపైకి ఆమెను తోసేశాడు. అదే సమయంలో తాంబరం నుంచి వస్తున్న రైలు ఆమెను ఢీకొట్టింది. ఈ ఘటనలో సత్య అక్కడికక్కడే మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Tamil Nadu
Chennai
Crime News
St. Thomas Mount railway station

More Telugu News