పెళ్లి పేరుతో జూనియర్ ఆర్టిస్టును గర్భవతిని చేసిన ‘కొత్తగా మా ప్రయాణం’ హీరో అరెస్ట్

Young Hero arrested for cheating junior artist
  • వర్ధమాన నటుడికి ఇప్పటికే పెళ్లి.. కుమార్తె కూడా
  • పెళ్లి పేరుతో యువతితో శారీరక సంబంధం
  • పెళ్లి ప్రస్తావన తీసుకొస్తే చంపేస్తానని బెదిరింపు
పెళ్లి పేరుతో జూనియర్ ఆర్టిస్టును గర్భవతిని చేసిన వర్ధమాన నటుడికి జూబ్లీహిల్స్ పోలీసులు అరదండాలు వేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వెంకటగిరిలో ఉంటూ సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టుగా పనిచేస్తున్న యువతి (25)కి జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 45లో ఉంటున్న వర్ధమాన నటుడు ప్రియాంత్‌రావు(30)తో  ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. ఆపై పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరక సంబంధం పెట్టుకున్నాడు. దీంతో గత జనవరిలో ఆమె గర్భం దాల్చింది. ఈ విషయాన్ని ప్రియాంత్‌రావుకు చెబితే గర్భవిచ్ఛిత్తి మాత్రలు ఇచ్చి వేసుకోమన్నాడు. 

అయితే, ఆ తర్వాత అతడికి వివాహమై కుమార్తె కూడా ఉందన్న విషయం తెలుసుకున్న యువతి నిలదీసింది. దీంతో ఆమెకు విడాకులు ఇవ్వబోతున్నట్టు చెప్పి నమ్మించే ప్రయత్నం చేశాడు. యువతి ఇటీవల మరోమారు అతడి వద్ద పెళ్లి ప్రస్తావన తీసుకురాగా చంపేస్తానని బెదిరించినట్టు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో యువతి పేర్కొంది. బాధిత యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు ప్రియాంత్‌రావును అరెస్ట్ చేశారు. కాగా, నిందితుడు నటించిన ‘కొత్తగా మా ప్రయాణం’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
Go Back to Shorts
Tollywood
Young Hero
Junior Artist
Love
Crime News
Priyanth Rao

More Telugu News