Facebook: మార్క్ జుకర్ బర్గ్ కు షాక్.. 1.20 కోట్ల నుంచి 10 వేల దిగువకు పడిపోయిన ఫేస్ బుక్ ఫాలోయర్ల సంఖ్య

  • లక్షలాది మంది ఫాలోయర్లను కోల్పోతున్న ఫేస్ బుక్ యూజర్లు
  • 9 లక్షల మంది ఫాలోయర్లను కోల్పోయానన్న తస్లీమా నస్రీన్
  • ఈ సమస్యపై పని చేస్తున్నామన్న ఫేస్ బుక్
Facebook users loosing followers and Zuckerberg alo loses millions

ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్ బుక్ లో ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఎన్నడూ లేని విధంగా పలువురు యూజర్లు లక్షలాది మంది ఫాలోయర్లను కోల్పోతున్నారు. సాక్షాత్తు ఫేస్ బుక్ సీఈఓ ఏకంగా 1.19 కోట్ల ఫాలోయర్లను కోల్పోయారు. ప్రస్తుతం ఆయన ఫాలోయర్ల సంఖ్య 10 వేల కంటే దిగువకు పడిపోయింది. ప్రముఖ బంగ్లాదేశీ రచయిత్రి తస్లీమా నస్రీన్ కూడా ఇదే అంశంపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. ఫేస్ బుక్ సృష్టించిన సునామీలో తనకు చెందిన దాదాపు 9 లక్షల మంది ఫాలోయర్లు కనుమరుగయ్యారని ఆమె అన్నారు. ఒడ్డున కేవలం 9 వేల మంది ఫాలోయర్లు మాత్రమే మిగిలిపోయారని వ్యాఖ్యానించారు. తనకు ఫేస్ బుక్ కామెడీ అంటే ఇష్టమని అన్నారు. 

మరోవైపు ఫేస్ బుక్ మాతృ సంస్థ మెటా అధికార ప్రతినిధి దీనిపై స్పందిస్తూ... తమ ఫేస్ బుక్ ప్రొఫైల్స్ లో ఫాలోయర్లకు సంబంధించి కొందరు అస్థిరమైన కౌంట్ ను చవిచూస్తున్నారని చెప్పారు. తాము ఈ సమస్యపై పని చేస్తున్నామని... త్వరలోనే పరిస్థితి సాధారణ స్థితికి వస్తుందని తెలిపారు. జరుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నామని చెప్పారు.

More Telugu News