Rahul Koli: 'ఆస్కార్' సినిమా 'చెల్లో షో' బాలనటుడి మృతి

Chello Show child actor Rahul Koli dies of blood cancer
  • భారత్ నుంచి ఆస్కార్ కు నామినేట్ అయిన 'చెల్లో షో'
  • 'చెల్లో షో' చిత్రంలో నటించిన రాహుల్ కోలి
  • కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్ తో పోరాటం
  • పరిస్థితి విషమించి కన్నుమూత
భారత్ నుంచి ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయిన చిత్రం 'చెల్లో షో". అయితే, ఈ చిత్ర యూనిట్ తాజాగా విషాదంలో మునిగిపోయింది. ఈ సినిమాలో నటించిన ఆరుగురు బాలనటుల్లో ఒకడైన రాహుల్ కోలి (15) మృతి చెందాడు. 

రాహుల్ కోలి గత కొంతకాలంగా ల్యుకేమియా (బ్లడ్ క్యాన్సర్) తో పోరాడుతున్నాడు. నాలుగు నెలల నుంచి అతడికి చికిత్స అందిస్తున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో రాహుల్ కోలి ఈ నెల 2న కన్నుమూశాడు. బాలనటుడి కుటుంబం గుజరాత్ లోని జామ్ నగర్ వద్ద స్వస్థలం హాపాలో నిన్న సంస్మరణ సభ ఏర్పాటు చేసింది. 

రాహుల్ కోలి ఓ పేద కుటుంబం నుంచి వచ్చాడు. అతడి అనారోగ్యానికి చికిత్స కోసం కుటుంబం తమకు జీవనాధారమైన ఆటోను కూడా అమ్మేసింది. అయినప్పటికీ రాహుల్ ను కాపాడుకోలేకపోయామని అతడి తండ్రి రాము కోలి కన్నీటిపర్యంతమయ్యాడు. 

తమ సినిమాలో అద్భుతంగా నటించిన రాహుల్ ఇకలేడని తెలిసి 'చెల్లో షో' చిత్ర యూనిట్ సభ్యులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 'చెల్లో షో' దర్శకుడు పాన్ నళిన్ స్పందిస్తూ, ఈ వార్త తమను కుదిపివేసిందని అన్నారు. రాహుల్ ను కాపాడుకోలేకపోయామని ఆవేదన వెలిబుచ్చారు.
Rahul Koli
Death
Blood Cancer
Chello Show
Oscar

More Telugu News