Mulayam Singh Yadav: తండ్రితో క‌లిసి ములాయం అంత్య‌క్రియ‌ల‌కు హాజ‌రైన క‌ల్వకుంట్ల‌ క‌విత‌

mlc kavitha attends mulayam last rites with his father kcr
  • ములాయం స్వ‌గ్రామం సైఫాయిలో ఆయ‌న అంత్య‌క్రియ‌లు
  • టీఆర్ఎస్ ప్ర‌తినిధి బృందంతో క‌లిసి వెళ్లిన కేసీఆర్‌
  • వీడియోను విడుద‌ల చేసిన క‌విత‌
స‌మాజ్ వాదీ పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి ములాయం సింగ్ యాద‌వ్ అనారోగ్య కార‌ణాల‌తో సోమ‌వారం మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. మంగ‌ళ‌వారం యూపీలోని ములాయం స్వ‌గ్రామం సైఫాయిలో ఆయ‌న అంత్య‌క్రియ‌లు జ‌రగ‌నున్న సంగ‌తి తెలిసిందే. ములాయం అంత్య‌క్రియ‌ల‌కు హాజ‌రు కానున్న‌ట్లు సోమ‌వార‌మే కేసీఆర్ అధికారికంగా ప్ర‌క‌టించారు. 

మంగ‌ళ‌వారం ఉద‌యం హైద‌రాబాద్ నుంచి ప్ర‌త్యేక విమానంలో యూపీ చేరుకున్న కేసీఆర్ కాసేప‌టి క్రితం సైఫాయి చేరుకున్నారు. కేసీఆర్ వెంట యూపీకి ప‌లువురు టీఆర్ఎస్ నేత‌లు వెళ్లారు. వారిలో కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత కూడా ఉన్నారు. త‌న తండ్రితో క‌లిసి ములాయం అంత్య‌క్రియ‌ల‌కు హాజ‌రవుతున్న‌ట్లుగా ఆమె పేర్కొన్నారు. తండ్రితో క‌లిసి సైఫాయి చేరుకున్న త‌మ వీడియోను కూడా ఆమె పోస్ట్ చేశారు.
Mulayam Singh Yadav
Uttar Pradesh
Samantha
TRS
Telangana
KCR
K Kavitha

More Telugu News