త్రివిక్రమ్ గారు ఎంతమంది హీరోలతో పనిచేసినా, ఆయన ఫస్టు హీరో నేనే: తరుణ్

Nuvve Nuvve 20 years celebrations
  • 'నువ్వే నువ్వే' 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ లో తరుణ్ 
  • స్రవంతి బ్యానర్లో మూడు హిట్లు కొట్టడం పట్ల హర్షం
  • 'నువ్వే నువ్వే' నిన్నగాక మొన్న చేసినట్టు ఉందంటూ ఆశ్చర్యం
  • త్రివిక్రమ్ తో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అంటూ ఆనందం
తరుణ్ హీరోగా చేసిన 'నువ్వే నువ్వే' సినిమా నిన్నటితో 20 ఏళ్లను పూర్తిచేసుకుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన సెలబ్రేషన్స్ కి, స్రవంతి రవికిశోర్ .. త్రివిక్రమ్ .. హీరో తరుణ్ .. హీరోయిన్ శ్రియ .. ప్రకాశ్ రాజ్ హాజరయ్యారు. ఈ వేదికపై తరుణ్ మాట్లాడుతూ .. 'నువ్వే నువ్వే' సినిమా చేసి అప్పుడే 20 ఏళ్లు అయిందా అనిపిస్తోంది. నాకు మాత్రం నిన్నగాక మొన్న చేసినట్టుగా ఉంది" అన్నాడు. 

"ఇప్పటికి కూడా నాకు ఎప్పుడైనా బోర్ కొడితే ఈ సినిమాలోని సీన్స్ ను చూసుకుంటూ ఉంటాను. రామోజీరావు గారు - రవి కిశోర్ గారు ఇద్దరూ కలిసి 'నువ్వే కావాలి' సినిమాతో నన్ను హీరోగా పరిచయం చేశారు. స్రవంతి బ్యానర్లో వరుసగా మూడు సినిమాలు చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. వరుసగా మూడు వండర్ఫుల్ మూవీస్ ఇచ్చినందుకు ఆయనకి థ్యాంక్స్ చెబుతున్నాను. 

హీరోగా నా ఫస్టు మూవీకి త్రివిక్రమ్ గారు డైలాగ్స్ రాశారు. డైరెక్టర్ గా ఆయన ఫస్టు సినిమాకి హీరోగా నేను చేయడం నాకు ఎంతో సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. ఇకపై ఆయన ఎంతమంది హీరోలతో చేసినా ఆయన ఫస్టు హీరో మాత్రం నేనే. ఇప్పటికీ నేను ఎక్కడికైనా వెళితే, 'నువ్వే నువ్వే' లాంటి సినిమా ఇంకొక్కటి చేయండి" అని అడుగుతూ ఉంటారు" అంటూ చెప్పుకొచ్చాడు.
Go Back to Shorts
Tarun
Shriya Saran
Trivikram Srinivas
Nuvve Nuvve Movie

More Telugu News