ఉక్రెయిన్ది ఉగ్ర చర్య... అందుకే క్షిపణి దాడులు: రష్యా అధ్యక్షుడు పుతిన్
- పేలుడుతో కూలిన కెర్బ్ వంతెన
- ఉక్రెయినే కూల్చివేసిందన్న పుతిన్
- కెర్బ్ వంతెన కూల్చివేత ఉగ్ర చర్యేనని వెల్లడి
- అందుకు ప్రతిగానే క్షిపణి దాడులు చేశామన్న రష్యా అధ్యక్షుడు
రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశంలో భాగంగా సోమవారం పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. క్రిమియాతో రష్యాను అనుసంధానం చేసే కెర్బ్ వంతెన ఇటీవలి పేలుడు కారణంగా కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు ఉక్రెయినే కారణమని పుతిన్ ఆరోపించారు. కెర్బ్ వంతెన కూల్చివేత ముమ్మాటికీ ఉగ్ర చర్యేనని ఆయన తేల్చి చెప్పారు. ఉక్రెయిన్ ఉగ్ర చర్యకు పాల్పడినందుననే ఆ దేశంపై క్షిపణి దాడులు చేయాల్సి వచ్చిందని పుతిన్ వెల్లడించారు.