నాకు ప్రాణహాని ఉంది... నాకు ఏం జరిగినా సీఎం జగన్‌దే బాధ్యత!: వివేకా కేసు అప్రూవర్ దస్తగిరి
- కడప ఎస్పీ కార్యాలయానికి వచ్చిన దస్తగిరి
- తనకు కేటాయించిన గన్ మెన్లను ఉన్న పళంగా మార్చారని ఆరోపణ
- వైసీపీ నేతలు తనపై వరుసగా కేసులు పెట్టిస్తున్నారని ఆవేదన
- తన విజ్ఞప్తులను కడప ఎస్పీ పట్టించుకోవడం లేదన్న దస్తగిరి
తనకు భద్రత కల్పించాలని కడప ఎస్పీకి దస్తగిరి విజ్ఞప్తి చేశాడు. సీబీఐ ఏఎస్పీ రాంసింగ్ సూచనల మేరకే తాను ఎస్పీ కార్యాయానికి వచ్చానని తెలిపాడు. తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే తనకు కేటాయించిన గన్మన్లను మార్చారని అతడు ఆరోపించాడు. తనకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో, సరైన భద్రత కల్పించాలన్న విషయంపై ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కడప ఎస్పీ పట్టించుకోవడం లేదని దస్తగిరి ఆవేదన వ్యక్తం చేశాడు.