Hyderabad: తెలంగాణ‌లో మ‌రో యానిమల్ వాక్సిన్ యూనిట్‌... రూ.700 కోట్లతో ఏర్పాటు చేయ‌నున్న ఐఐఎల్‌

iil will ser up another animal vaccine manufacturing facility in Genome Valley
  • ఇప్ప‌టికే గ‌చ్చిబౌలిలో ఐఐఎల్‌కు ఓ వాక్సిన్ త‌యారీ యూనిట్‌
  • కొత్త‌గా జీనోమ్ వ్యాలీలో మ‌రో యూనిట్‌
  • ఈ యూనిట్‌తో 750 మందికి ఉపాధి
  • ఐఐఎల్ ప్ర‌తిపాద‌న‌ను ఆహ్వానించిన మంత్రి కేటీఆర్‌
పెట్టుబ‌డుల ఆకర్ష‌ణ‌లో దూసుకుపోతున్న తెలంగాణ‌... సోమ‌వారం మ‌రో భారీ పెట్టుబ‌డిని సాధించింది. హైద‌రాబాద్ శివారులోని జీనోమ్ వ్యాలీలో యానిమల్ వాక్సిన్ త‌యారీ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ఇండియ‌న్ ఇమ్యూనోలాజిక‌ల్స్ లిమిటెడ్ (ఐఐఎల్‌) ముందుకు వ‌చ్చింది. ఈ యూనిట్ కోసం ఐఐఎల్ ఏకంగా రూ.700 కోట్ల‌ను పెట్టుబ‌డిగా పెట్ట‌నుంది. ఈ మేర‌కు సోమ‌వారం హైద‌రాబాద్ వ‌చ్చిన ఐఐఎల్ ఎండీ ఆనంద్ కుమార్ త‌న ప్ర‌తినిధి బృందంతో రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా వారు హైద‌రాబాద్‌లో త‌మ నూత‌న పెట్టుబ‌డి ప్ర‌తిపాద‌న‌ల‌ను కేటీఆర్‌కు వెల్ల‌డించారు.

ఇప్ప‌టికే గ‌చ్చిబౌలిలో ఐఐఎల్‌కు ఓ యానిమల్ వాక్సిన్ ప్లాంట్ ఉంది. ఇందులో ఏడాదికి 300 మిలియ‌న్ వాక్సిన్ డోసుల‌ను ఆ సంస్థ ఉత్ప‌త్తి చేస్తోంది. కొత్త‌గా జీనోమ్ వ్యాలీలో ఏర్పాటు చేయ‌నున్న త‌న త‌దుప‌రి యూనిట్‌లో ఏడాదికి మ‌రో 300 మిలియ‌న్ యూనిట్ల వాక్సిన్ల‌ను ఉత్ప‌త్తి చేయ‌నుంది. రూ.700 కోట్ల పెట్టుబ‌డితో ఏర్పాటు చేయ‌నున్న ఈ యూనిట్ ద్వారా రాష్ట్రంలో 750 మందికి పైగా ఉపాధి లభించ‌నుంద‌ని కేటీఆర్ చెప్పారు. ఇప్ప‌టికే వాక్సిన్ కేపిట‌ల్ ఆఫ్ వ‌రల్డ్‌గా ప్ర‌సిద్ధి చెందిన హైద‌రాబాద్‌లో ఐఐఎల్ మ‌రో వాక్సిన్ యూనిట్‌ను ఏర్పాటు చేయ‌నుండ‌డం హర్షణీయమని ఆయ‌న తెలిపారు.
Hyderabad
TRS
KTR
IIL
Indian Immunologicals Limited
Genome Valley
Telangana

More Telugu News