Amit Shah: ములాయం పార్థివ దేహానికి నివాళి అర్పించిన‌ అమిత్ షా

amit shah pad trbute to mulayam singh yadav
షార్ట్స్‌లో చూడండి
ఉత్త‌ర ప్ర‌దేశ్ రాజ‌కీయాలతో పాటు జాతీయ రాజ‌కీయాల్లో కీల‌క పాత్ర పోషించిన స‌మాజ్ వాదీ పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు ములాయం సింగ్ యాద‌వ్ సోమ‌వారం ఉద‌యం మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యం తెలుసుకున్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నేరుగా గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుప‌త్రికి వెళ్లి ములాయం పార్థివ దేహానికి నివాళి అర్పించారు. అక్క‌డే ఉన్న ములాయం కుమారుడు, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాద‌వ్‌కు ఓదార్చారు. 

ఈ సంద‌ర్భంగా ములాయం రాజ‌కీయ ప్ర‌స్థానాన్ని అమిత్ షా కొనియాడారు. ఉత్త‌ర ప్ర‌దేశ్ రాజ‌కీయాల‌తో పాటు జాతీయ రాజకీయాల్లోనూ ములాయం కీల‌క పాత్ర పోషించార‌ని ఆయ‌న అన్నారు. ములాయం మృతి యూపీతో పాటు జాతీయ రాజ‌కీయాల్లో భారీ శూన్యత ఆవహించిందని తెలిపారు. ములాయం మృతితో ఏర్ప‌డ్డ లోటు పూడ్చ‌లేనిదేన‌ని అమిత్ షా పేర్కొన్నారు.
Go Back to Shorts
Amit Shah
Mulayam Singh Yadav
Akhilesh Yadav
Uttar Pradesh
Samajwadi Party
BJP

More Telugu News