"దత్త తండ్రి తరఫున దత్తపుత్రుడి మియావ్ మియావ్" అంటూ పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యంగ్యం
- మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ విశాఖ గర్జన సభ
- ఎందుకీ గర్జనలు అంటూ పవన్ కల్యాణ్ ప్రశ్నాస్త్రాలు
- ఏంసాధించారని నిలదీసిన జనసేనాని
- ట్విట్టర్ లో బదులిచ్చిన మంత్రి అమర్నాథ్
ఈ నేపథ్యంలో, ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ జనసేనాని పవన్ కల్యాణ్ కు కౌంటర్ ఇచ్చారు. "దత్త తండ్రి చంద్రబాబు తరఫున దత్త పుత్రుడు పవన్ కల్యాణ్ మియావ్ మియావ్" అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు.
1.అంతర్జాతీయ రాజధాని మాస్కో
2. జాతీయ రాజధాని ముంబయి
3. పక్క రాష్ట్ర రాజధాని హైదరాబాద్
ఇవే దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ త్రీ క్యాపిటల్స్ అంటూ అమర్నాథ్ ఎద్దేవా చేశారు.