Deepinder Goyal: మూడ్నెల్లకోసారి డెలివరీ బాయ్ అవతారం ఎత్తే జొమాటో సీఈవో దీపిందర్ గోయల్

Zomato CEO Deepinder Goyal turns delivery boy for every quarter
  • ఆసక్తికర అంశాలు వెల్లడించిన నౌఖరీ డాట్ కామ్ అధినేత
  • ఇటీవల దీపిందర్ గోయల్ తో మాట్లాడానన్న భిఖ్ చందానీ
  • మూడేళ్లుగా గోయల్ ఇలాగే చేస్తున్నాడని వెల్లడి
దేశంలో ప్రముఖ డెలివరీ యాప్ గా పేరొందిన సంస్థ జొమాటో. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లోనూ, పట్టణాల్లోనూ జొమాటో సేవలు విస్తరించాయి. ఈ సంస్థకు దీపిందర్ గోయల్ సీఈవో. ఆయన గురించి నౌఖరీ డాట్ కామ్ అధినేత సంజీవ్ భిఖ్ చందానీ ఆసక్తికర అంశం వెల్లడించారు. 

దీపిందర్ గోయల్ ప్రతి మూడు నెలలకు ఓసారి డెలివరీ బాయ్ అవతారం ఎత్తుతాడని తెలిపారు. రోజంతా ఆర్డర్లు డెలివరీ చేస్తారని పేర్కొన్నారు. గోయల్ జొమాటా బ్రాండ్ నేమ్ తో కూడిన ఎర్ర రంగు టీషర్టు ధరించి, బైక్ పై తిరుగుతూ స్వయంగా డెలివరీలు ఇస్తారని వివరించారు. 

ఇటీవల గోయల్ తో మాట్లాడిన సందర్భంగా ఈ విషయం తెలిసిందని భిఖ్ చందానీ వెల్లడించారు. ఇది గత మూడేళ్లుగా జరుగుతోందని తెలిపారు. అంతేకాదు, ఇప్పటివరకు తనను ఎవరూ గుర్తుపట్టలేదని దీపిందర్ గోయల్ చెప్పినట్టు భిఖ్ చందానీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. 

గోయల్ మాత్రమే కాదని, జొమాటో సంస్థలోని సీనియర్ మేనేజర్లందరూ ఈ విధంగా మూడ్నెల్లకోసారి డెలివరీ బాయ్ అవతారం ఎత్తుతుంటారని వివరించారు.
Deepinder Goyal
Zomato
Delivery Boy
Sanjiv Bhikhchandani
Naukri.Com

More Telugu News