అటు కుమార్తెల పెళ్లి... ఇటు తండ్రికి ఐదో పెళ్లి.. వివరాలతో కూడిన వీడియో ఇదిగో

56 year old pakistan man married five times
  • ఇప్పటికే నాలుగు పెళ్లిళ్లతో.. పది మంది కుమార్తెలు, ఒక కుమారుడు
  • చివరి ఇద్దరు కుమార్తెల పెళ్లి సమయంలో తండ్రికి ఐదో పెళ్లి
  • తండ్రి కోసం వధువును వెతికిన కుమార్తెలు..
  • ఇంటర్వ్యూ వీడియో వైరల్
ఆయన వయసు 56 ఏళ్లు.. పేరు షౌకత్‌.. పది మంది కుమార్తెలు.. ఒక కుమారుడు.. మనవళ్లు, మనవరాళ్లు కలిపి మరో 51 మంది.. ఇలాంటి కుటుంబాలు చాలానే ఉంటాయి. కానీ ఈయన కథ వేరు. ఆయన ఇటీవలే ఐదో పెళ్లి చేసుకున్నాడు. అది కూడా ఓ వైపు తన కుమార్తెల పెళ్లి జరుగుతున్న సమయంలోనే.. మరోవైపు తండ్రి కూడా పెళ్లిచేసుకోవడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ గా మారింది.

ఇప్పటికే నాలుగు పెళ్లిళ్లు అయినా..
పాకిస్థాన్ లోని ఇస్లామాబాద్ కు చెందిన షౌకత్ కు గతంలో నాలుగు పెళ్లిళ్లు అయ్యాయి. వారిలో అనారోగ్యం, ప్రమాదంతో మృతి చెందడం, విడాకుల కారణంగా వారందరికీ దూరమయ్యాడు. అయితే పది మంది కుమార్తెలు, ఒక కుమారుడు మాత్రం తండ్రితోనే కలిసి ఉన్నారు. వీరిలో కుమారుడికి, ఎనిమిది మంది కుమార్తెలకు ఇప్పటికే పెళ్లిళ్లు అయ్యాయి. వారందరికీ కలిపి 40 మంది పిల్లలు కూడా ఉన్నారు. ఇటీవలే చివరి ఇద్దరు కుమార్తెలకు మంచి సంబంధాలు రావడంతో పెళ్లి కుదిరింది. 

కుమార్తెల ఒత్తిడితో..
ఈ సందర్భంగా, చివరి ఇద్దరు కుమార్తెలు తండ్రి భవిష్యత్తు గురించి ఆలోచించారు. తాము పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లిపోతే తండ్రి బాగోగులు చూసుకునేది ఎవరని వారు భావించారు. ఈ క్రమంలో తండ్రిని మరో పెళ్లి చేసుకోవాలని వారు ప్రోత్సహించారు. అంతేకాదు, తండ్రి కోసం ఓ వధువును కూడా చూశారు. బంధువుల సహకారంతో ఓ మహిళను చూసి.. తండ్రికి పెళ్లి చేశారు. ఇది కూడా ఆ కుమార్తెల పెళ్లి జరిగినరోజే కావడం గమనార్హం. యాసిర్ షమీ అనే యూట్యూబర్ గతేడాది ఐదో పెళ్లి నేపథ్యంలో షౌకత్ ను ఇంటర్వ్యూ చేయగా, ఇటీవల ఆ వీడియో వైరల్ అవుతోంది. దాంతో, ఈ పెళ్లిళ్ల వ్యవహారం అందరికీ తెలిసింది. 

Go Back to Shorts
Pakistan
man
married five times
Viral Videos
youtube
Offbeat

More Telugu News