ipl: ఒత్తిడి అనిపిస్తుందా.. అయితే ఐపీఎల్‌లో ఆడొద్దు: క‌పిల్ దేవ్‌

Do not play in IPL if you feel pressure says Former India captain Kapil Dev
  • ఆట‌గాళ్ల‌కు దిగ్గ‌జ క్రికెట‌ర్ సూచ‌న‌
  • ఐపీఎల్‌లో తీవ్ర ఒత్తిడి ఉంటుంద‌ని ఫిర్యాదులు వ‌స్తున్నాయ‌న్న క‌పిల్
  • ఆట‌ను ఆస్వాదిస్తుంటే ఒత్తిడి ద‌రిచేర‌ద‌ని వ్యాఖ్య‌
ఐపీఎల్ విష‌యంలో భార‌త మాజీ కెప్టెన్ క‌పిల్ దేవ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. ఆటగాళ్లకు ఒత్తిడి ఎక్కువగా ఉంటే ఐపీఎల్‌లో ఆడవద్దని సూచించాడు. ఆధునిక క్రికెట్‌లో ఒత్తిడిని ఎదుర్కొంటున్న ఆటగాళ్ల గురించి అడిగినప్పుడు క‌పిల్‌.. నిర్మొహమాటంగా ఈ వ్యాఖ్య‌లు చేశాడు. ఓ కార్య‌క్ర‌మంలో అభిమానుల‌తో మాట్లాడిన క‌పిల్ దేవ్‌.. ఐపీఎల్ లో ఆడటం వల్ల వచ్చే ఒత్తిడి గురించి తాను చాలా ఫిర్యాదులను చూశానని చెప్పాడు. ఆటగాళ్లు ఎక్కువ ఒత్తిడికి గురైతే ఐపీఎల్‌లో ఆడవద్దని కోరాడు.

"ఐపీఎల్‌లో ఆడేందుకు ఆటగాళ్లపై చాలా ఒత్తిడి ఉంటుందని నేను టీవీలో చాలాసార్లు వింటున్నాను. అప్పుడు నేను ఒక్కటి మాత్రమే చెబుతున్నాను, ఆడవద్దు. క్రికెట్‌పై ఆటగాడికి అభిరుచి ఉంటే, ఒత్తిడి ఉండదు. డిప్రెషన్ వంటి ఈ అమెరికన్ పదాలను నేను అర్థం చేసుకోలేను. నేను మాజీ ప్లేయ‌ర్‌.  మేం ఆటను ఆస్వాదించాం కాబ‌ట్టే ఆడాము. ఆట‌ను ఆస్వాదిస్తున్న‌ప్పుడు ఎటువంటి ఒత్తిడి ఉండ‌దు" అని క‌పిల్ దేవ్ పేర్కొన్నాడు.
ipl
kapil dev
cricketers
dnot play
pressure

More Telugu News