తండ్రయిన దిగ్గజ టెన్నిస్ ఆటగాడు
- స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్‌కు కొడుకు
- శనివారం రాత్రి మగ బిడ్డకు జన్మనిచ్చిన అతని భార్య ఫ్రాన్సిస్కా
- 2019లో ఫ్రాన్సిస్కాను పెళ్లి చేసుకున్న నాదల్
తండ్రయిన నాదల్‌కు సెర్బియా టెన్నిస్ వీరుడు నొవాక్ జొకోవిచ్ శుభాకాంక్షలు తెలిపాడు. "కంగ్రాట్. నాకు ఇప్పటిదాకా తెలియదు. అది అద్భుతమైన వార్త. నాదల్, అతని భార్య, బిడ్డ ఆరోగ్యం, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. ఒక తండ్రిగా నేను అతనికి ఎటువంటి సలహా ఇవ్వను (నవ్వుతూ). ఆయనకు పెద్ద కుటుంబం ఉంది. నాదల్ తనను తాను అనుభూతి చెందుతాడని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను (నవ్వుతూ)" అని ట్వీట్ చేశాడు.