టీడీపీ దుశ్శాసనుల పార్టీగా మారింది: ఏపీ మంత్రి రోజా
- ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యపై స్పందించిన రోజా
- టీడీపీ నేతలే మహిళలపై అరాచకాలకు పాల్పడుతున్నారని ఆరోపణ
- ఐ టీడీపీ అంటే ఇడియట్స్ టీడీపీ అని కామెంట్
- టీడీపీ నేతలను రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని మహిళలకు రోజా పిలుపు
టీడీపీ హయాంలోనే రిషితేశ్వరిపై ఘోరం జరిగిందని, వనజాక్షి లాంటి మహిళా అధికారిని ఇసుకలో వేసి కొట్టడం జరిగిందని రోజా అన్నారు. ఇప్పుడు కూడా టీడీపీ నేతల వల్లే మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. ప్రతి చిన్న విషయానికి ట్వీట్లు చేసే లోకేశ్... ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యపై ఎందుకు స్పందించలేదని ఆమె ప్రశ్నించారు. ఐ టీడీపీ అంటే ఇడియట్స్ పార్టీ అంటూ ఆమె మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలను రాష్ట్రంలోని మహిళలంతా తరిమికొట్టాలని ఆమె పిలుపునిచ్చారు.