Janasena: వైసీపీ ప్రభుత్వానిది ఆదాయంలో ప్రగతా? అప్పుల్లో ప్రగతా?: నాదెండ్ల మనోహర్

  • రాష్ట్ర రాబ‌డులు 36 శాత‌మేన‌న్న నాదెండ్ల‌
  • మిగిలిన 64 శాతం అప్పులు,  కేంద్ర గ్రాంట్లేన‌ని వెల్ల‌డి
  • జీఎస్టీ వ‌సూళ్లు పెరిగితే మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న ఎక్క‌డ అని నిల‌దీత‌
nadendla manohar satires on ysrcp government

ఏపీలో వైసీపీ పాల‌న‌పై జ‌న‌సేన రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ (పీఏసీ) చైర్మ‌న్ నాదెండ్ల మనోహ‌ర్ శుక్ర‌వారం నిప్పులు చెరిగారు. వైసీపీ ప్ర‌భుత్వం చెబుతున్న‌ట్లుగా రాష్ట్రం ప్ర‌గ‌తి ప‌థంలో సాగుతున్నట్లే అయితే... ఆ ప్ర‌గ‌తి ఆదాయంలోనా?.. లేదంటే అప్పుల్లోనా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. 

రాష్ట్రానికి రాబ‌డులు 36 శాతంగా ఉంటే... అప్పులు మాత్రం 64 శాతంగా ఉన్నాయ‌ని ఈ సందర్భంగా నాదెండ్ల గుర్తు చేశారు. ఈ గ‌ణాంకాలు రాష్ట్ర ప్ర‌గ‌తి దేనిలో అన్న విష‌యాన్ని చెప్ప‌డం లేదా? అని ఆయన నిల‌దీశారు.

రాష్ట్ర ప్ర‌భుత్వం ఖ‌ర్చు చేస్తున్న నిధుల్లో 36 శాతం మాత్ర‌మే రాబ‌డి ఉంటే...మిగిలిన 64 శాతం అప్పులతో పాటు కేంద్రం విడుద‌ల చేస్తున్న గ్రాంట్లే ఉన్నాయ‌ని నాదెండ్ల ఆరోపించారు. ఏడాదిలో చేయాల్సిన అప్పులు... 5 నెలల్లో చేయడమే అభివృద్ధా? అని ఆయన ప్రశ్నించారు. జీఎస్టీ ఆదాయం జాతీయ సగటు కంటే రాష్ట్ర సగటు ఎక్కువైతే మౌలిక వసతుల కల్పన ఎందుకు చేయడం లేదు? అని నాదెండ్ల మనోహర్ నిల‌దీశారు.

More Telugu News