Chiranjeevi: ఈ సారి మమ్ముట్టి మూవీ రీమేక్ పై దృష్టి పెట్టిన మెగాస్టార్!

Chiranjeevi in Bheeshma Parvam Remake
  • చిరంజీవి తాజా చిత్రంగా వచ్చిన 'గాడ్ ఫాదర్'
  • తొలి రోజునే హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా 
  • మలయాళ మూవీ 'భీష్మ పర్వం' రీమేక్ హక్కులు చరణ్ చేతికి
  • త్వరలో ఆ రీమేకులో చేయనున్న మెగాస్టార్   
చిరంజీవి హీరోగా మోహన్ రాజా రూపొందించిన 'గాడ్ ఫాదర్' ఈ నెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్వీ ప్రసాద్ - ఆర్బీ చౌదరి నిర్మించిన ఈ సినిమా, తొలి రోజునే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. చిరంజీవితో పాటు నయనతార .. సత్యదేవ్ పాత్రలు ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాయి. 

మలయాళంలో కొంతకాలం క్రితం మోహన్ లాల్ చేసిన 'లూసిఫర్' సినిమాకి ఇది రీమేక్. తెలుగు నేటివిటీకి తగినట్టుగా చిన్న చిన్న మార్పులు చేసి 'గాడ్ ఫాదర్' గా ఆడియన్స్ ముందుకు తీసుకుని వచ్చారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది. రెండు రోజుల్లో ఈ సినిమా 69 కోట్లను వసూలు చేయడం విశేషం. 

ఈ నేపథ్యంలో చిరంజీవి మరో మలయాళ సినిమా రీమేకులో చేయనున్నట్టుగా సమాచారం. ఆ సినిమా పేరే 'భీష్మ పర్వం'. మమ్ముట్టి కథానాయకుడిగా నటించిన ఈ సినిమా ఈ ఏడాది మార్చిలో విడుదలైంది. అక్కడ సక్సెస్ టాక్ ను తెచ్చుకున్న ఈ సినిమా రీమేక్ హక్కులను చరణ్ సొంతం చేసుకున్నాడు. ఈ సినిమా రీమేకులోనే చిరంజీవి చేయనున్నాడనే టాక్ బలంగా వినిపిస్తోంది.
Chiranjeevi
Mammootty
Bheeshma Parvam Remake

More Telugu News