Bollywood: అర్జెంటుగా చికెన్ 65 చేయ‌డం నేర్చుకోవాలంటున్న షారుక్ ఖాన్‌

Shah Rukh Khan says he had a blast with Nayanthara Vijay Sethupathi at Jawan sets

  • అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో 'జ‌వాన్‌'లో హీరోగా న‌టిస్తున్న షారుక్‌
  • 30 రోజుల షెడ్యూల్ పూర్తి చేసిన చిత్ర యూనిట్
  • న‌య‌న‌తార‌, విజ‌య్ సేతుప‌తి, అనిరుధ్‌తో సెట్స్ విశేషాల‌ను పంచుకుంటూ షారుక్ ట్వీట్

షారుక్ ఖాన్ వ‌చ్చే ఏడాది త‌న ఫ్యాన్స్‌కు ట్రిపుల్ ధ‌మాకా ఇవ్వ‌నున్నారు. ఆయ‌న న‌టించిన మూడు సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి. ఇందులో ఒక‌టి 'జవాన్‌'. త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో షారుక్ స‌ర‌స‌న సౌత్ లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టించింది. మ‌రో స్టార్ విజ‌య్ సేతుప‌తి కీల‌క పాత్ర పోషించాడు. అనిరుధ్ సంగీతం అందించిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. త‌న సొంత బ్యాన‌ర్ రెడ్ చిల్లీస్ ఎంట‌ర్ టైన్‌మెంట్ రూపొందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ గురించి షారుక్ ట్విట్ట‌ర్‌లో అప్ డేట్ ఇచ్చారు. 30 రోజుల పాటు జ‌రిగిన షెడ్యూల్‌లో చిత్ర యూనిట్‌తో తాను ఎలా ఆస్వాదించాననే విష‌యాన్ని అభిమానుల‌తో పంచుకున్నారు. త‌లైవా ర‌జ‌నీకాంత్‌, తల‌ప‌తి విజ‌య్ త‌మ సెట్స్ ను సంద‌ర్శించిన విష‌యాన్ని తెలిపారు.

‘30 రోజులు చాలా అద్భుతంగా గ‌డిచాయి. త‌లైవా ర‌జ‌నీకాంత్ మా సెట్స్‌కు వ‌చ్చి ఆశీర్వ‌దించారు. న‌య‌న‌తార‌తో క‌లిసి సినిమా చూశా. అనిరుధ్ తో క‌లిసి పార్టీ చేసుకున్నా. విజ‌య్ సేతుప‌తి తో ఎన్నో విష‌యాలు మాట్లాడుకున్నాం. త‌ల‌ప‌తి విజ‌య్ ఎంతో రుచిక‌ర‌మైన ఆహారం తినిపించారు. గొప్ప ఆతిథ్యం ఇచ్చిన అట్లీ, ప్రియ‌కు చాలా థ్యాంక్స్‌. ఇప్పుడు నేను చికెన్ 65 చేయ‌డం నేర్చుకోవాలి’ అని షారుక్ ట్వీట్ చేశారు. కాగా, ఈ చిత్రంలో షారుక్, నయనతార, విజయ్ సేతుపతితో పాటు ప్రియమణి, సన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్, యోగి బాబు కూడా నటించారు. వ‌చ్చే ఏడాది జూన్ 2వ తేదీన‌ ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు.

Bollywood
Kollywood
Shahrukh Khan
nayanatara
Vijay Sethupathi
jawan
sets
  • Loading...

More Telugu News