అయోధ్యలో రామాలయ నిర్మాణంపై యూపీ సీఎం కీలక ప్రకటన
- నిర్మాణ పనులు సగం పూర్తయినట్టు ప్రకటన
- ఎన్నో చర్యల ఫలితమే ఇదన్న యూపీ సీఎం
- 2024 మకర సంక్రాంతి రోజున ప్రతిష్టాపన
1949లో రామమందిరం కోసం ఉద్యమం ఆరంభమైన విషయాన్ని గుర్తు చేశారు. ఈ చర్యల ఫలితమే ఆలయ నిర్మాణం సగం పూర్తి అయినట్టు చెప్పారు. ఇటీవలే కాలం చేసిన తన గురువు, మార్గదర్శి ఆచార్య ధర్మేంద్రకు ఈ సందర్భంగా నివాళులు అర్పించారు. రాముడు జన్మించిన చోటే ఆలయాన్ని నిర్మించాలన్నది ఆచార్య కలగా పేర్కొన్నారు.