అమరావతి రైతుల పాదయాత్రకు పోటీగా వైసీపీ పాదయాత్ర: మంత్రి అమర్‌నాథ్
- పాదయాత్ర పేరుతో విద్వేషాలు రెచ్చగొడితే అందుకు ప్రభుత్వం బాధ్యత వహించదని స్పష్టీకరణ
- పాదయాత్రను ఆపేయాలని కోరిన మంత్రి
- త్వరలోనే విశాఖ నుంచి జగన్ పాలిస్తారన్న అమర్‌నాథ్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి త్వరలోనే విశాఖపట్టణం నుంచి పరిపాలన సాగిస్తారని మంత్రి తెలిపారు. వచ్చే విజయ దశమి నాటికి విశాఖ పూర్తిస్థాయిలో రాజధాని కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. కాగా, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలో విశాఖలోని సర్క్యూట్ హౌస్‌లో వైసీపీ నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అమరావతి రైతుల పాదయాత్రకు పోటీగా మరో పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు.