లక్నోలో భారీ వర్షం.. తొలి వన్డేపై కమ్ముకున్న నీలినీడలు
- ఈరోజు ప్రారంభం కావాల్సిన తొలి వన్డే
- వర్షం కారణంగా ఇంత వరకు పడని టాస్
- భారత జట్టుకు నాయకత్వం వహిస్తున్న శిఖర్ ధావన్
దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్ కు శిఖర్ ధావన్ నాయకత్వం వహించనున్నాడు. తొలి వన్డేకు సంబంధించి ఒంటి గంటకే టాస్ పడాల్సి ఉన్నప్పటికీ.... వర్షం కారణంగా ఇంత వరకు పడలేదు. భారత జట్టులో ధావన్, సంజు శాంసన్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, శుభ్ మన్ గిల్, శార్దూల్ ఠాకూర్, షాబాజ్ అహ్మద్, అవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, దీపక్ చాహర్ ఉన్నారు.