Amaravati: 'గో బ్యాక్' అంటూ అమరావతి రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా పోస్టర్లు

Posters against Amaravati Farmers padayatra in Tadepalligudem
  • తాడేపల్లిగూడెంలో కొనసాగుతున్న అమరావతి రైతుల పాదయాత్ర
  • ఫేక్ యాత్రికులు అంటూ రైతులకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు
  • అమరావతి రియలెస్టేట్ వద్దు.. ఆంధ్రా స్టేట్ ముద్దు
అమరావతే ఏపీ రాజధానిగా ఉండాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న పాదయాత్ర ప్రస్తుతం తాడేపల్లిగూడెంకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో ఫ్లెక్సీల వార్ నెలకొంది. కొందరు అమరావతి రైతులకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా... మరికొందరు రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

రైతులకు వ్యతిరేక ఫ్లెక్సీల్లో 'గో బ్యాక్ ఫేక్ యాత్రికులు' అని పేర్కొన్నారు. రైతుల ముసుగులోని ఫేక్ యాత్రికులు గో బ్యాక్ అని ఫ్లెక్సీల్లో రాశారు. 'అమరావతి రియలెస్టేట్ వద్దు. ఆంధ్రా స్టేట్ ముద్దు' అని పేర్కొన్నారు. రాష్ట్రం కోసం జగన్ ఆరాటం... 26 గ్రామాల కోసం చంద్రబాబు నకిలీ పోరాటం అని రాశారు. జగన్ ది అభివృద్ధి మంత్రం.. చంద్రబాబుది రాజకీయ కుతంత్రం అని పేర్కొన్నారు. మరోవైపు ఈ ఫ్లెక్సీలపై అమరావతి రైతులు, టీడీపీ, జనసేన నేతలు మండిపడుతున్నారు.
Amaravati
Farmers
Padayatra
Anti Flexi

More Telugu News