Karnataka: తలపై 42 కొబ్బరికాయలు పెట్టి ఒక్క నిమిషంలో నాన్​ చాకుతో పగలగొట్టాడు. ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఇదిగో

Karnataka man smashes 42 coconuts on heads in a minute with Nunchaku
  • నాన్ చాకు కొద్దిగా పక్కకు కదిలినా తలకు బలంగా దెబ్బతగిలే ప్రమాదం
  •  ఎంతో కష్టమైన ఫీట్ ను సులువుగా సాధించిన కర్ణాటక వ్యక్తి కేవీ సైదలవి
  • గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కిన ఫీట్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
కొబ్బరి కాయను చేత్తో పగలగొట్టడమంటేనే కొందరికి కష్టమనిపిస్తుంది. అదీ తలపై పెట్టడం, వాటిని నాన్ చాకుతో పగలగొట్టడమంటే చాలా కష్టం. అంతేకాదు.. కొబ్బరికాయ తలపై గట్టిగా తగిలినా, నాన్ చాకు కొద్దిగా పక్కకు జరిగి తలకు తగిలినా అంతే సంగతులు. అసలే కొబ్బరికాయ గుండ్రంగా ఉంటుంది. నాన్ చాకుతో కచ్చితంగా పై భాగాన తగిలితేనే పగులుతుంది. లేకుంటే పక్కకు జరిగి దెబ్బ తగులుతుంది. ఇంత కష్టమైన ఫీట్ ను కర్ణాటకకు చెందిన కేవీ సైదలవి అనే మార్షల్ ఆర్టిస్ట్ మంచినీళ్లు తాగినట్టుగా చేయడం గమనార్హం.

గిన్నిస్ బుక్ రికార్డు కోసం..
కర్ణాటకలోని ముదుర్ ప్రాంతానికి చెందిన కేవీ సైదలవి మార్షల్ ఆర్టిస్ట్. నాన్ చాకు ఆయుధాన్ని ఉపయోగించడంలో దిట్ట. దీనిని ఆయన ప్రపంచ రికార్డు కోసం ఆసరాగా చేసుకున్నారు. గుండ్రంగా ఆరుగురు వ్యక్తులను కూర్చోబెట్టి.. వారి మధ్యలో తాను నిలుచున్నాడు. మధ్యలో గుండ్రంగా తిరుగుతూ.. ఒక్కొక్కరి తలపై కొబ్బరికాయలు పెట్టుకున్న కొద్దీ నాన్ చాకుతో పగలగొట్టడం మొదలుపెట్టాడు.
  • చుట్టూ కూర్చున్నవారు తలపై కొబ్బరికాయలు పగిలిన కొద్దీ మరొకటి పెట్టుకుంటూ ఉండగా.. సైదలవి వాటిని పగలగొడుతూ వచ్చాడు. ఇలా కేవలం ఒక్క నిమిషంలో 42 కొబ్బరికాయలను నాన్ చాకుతో పగలగొట్టాడు.
  • గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ తమ ట్విట్టర్ ఖాతాలో ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేసింది. సైదలవి మొదట మెల్లగా మొదలుపెట్టినా తర్వాత వేగం అందుకున్నాడని.. ప్రపంచ రికార్డు సృష్టించాడని గిన్నిస్ ప్రతినిధులు పేర్కొన్నారు.
  • ఈ వీడియోకు భారీగా వ్యూస్ వస్తున్నాయి. ‘‘అవేదో కోడిగుడ్లు అన్నట్టుగా పగలగొట్టేస్తున్నాడు. కొబ్బరికాయలను తలపై పెట్టి కొట్టడమేంటి?” అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
  • ‘‘నాన్ చాకుతో పగలగొట్టే మార్షల్ ఆర్టిస్ట్ ఏమోగానీ.. తలపై కొబ్బరికాయలు పెట్టుకుని పగలగొట్టించుకున్నవారు మాత్రం గ్రేట్” అని మరికొందరు అంటున్నారు.
Karnataka
Nunchaku
coconuts
Guinness book
Guinness world record
India
Offbeat
Viral Videos

More Telugu News