CM KCR: ములాయం ఆరోగ్య పరిస్థితిపై అఖిలేశ్ యాదవ్ కు ఫోన్ చేసిన సీఎం కేసీఆర్

CM KCR talks to Akilesh Yadav over Mulayam Singh Yadav health
  • ములాయం ఆరోగ్య పరిస్థితి విషమం
  • మేదాంత ఆసుపత్రిలో చికిత్స
  • ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన సీఎం కేసీఆర్
  • దసరా తర్వాత కలుస్తానని అఖిలేశ్ తో వెల్లడి
సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపక నేత ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ములాయం తనయుడు అఖిలేశ్ యాదవ్ కు తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోన్ చేశారు. ములాయం ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. దసరా పండుగ తర్వాత స్వయంగా వచ్చి కలుస్తానని అఖిలేశ్ కు చెప్పారు. ములాయం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. 

82 ఏళ్ల ములాయం గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. నిన్న ఆయన ఆరోగ్యం బాగా క్షీణించడంతో క్రిటికల్ కేర్ యూనిట్ లో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ములాయం గురుగ్రామ్ లోని మేదాంత ఆసుపత్రిలో ఆంకాలజిస్టుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.
CM KCR
Mulayam Singh Yadav
Akhilesh Yadav
Health
Samajwadi Party
Uttar Pradesh
Telangana

More Telugu News