Roja: సినీ, రాజకీయ ప్రముఖులకు దిష్టి ఎక్కువగా ఉంటుంది: రోజా

Roja visits Vizag Swaroopanandrendra peetam
  • విశాఖ శారదా పీఠాన్ని సందర్శించిన రోజా
  • తాను ఆలయాలు, హోమాలు జరిగే ప్రాంతాలను దర్శిస్తుంటానని వ్యాఖ్య
  • దీని వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుందన్న రోజా
ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖ మంత్రి రోజా ఈరోజు విశాఖలోని శారదా పీఠాన్ని సందర్శించారు. పీఠంలో ఉన్న రాజశ్యామలాదేవి అమ్మవారికి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వరూపానంద సరస్వతి ఆశీస్సులను కూడా తీసుకున్నారు. 

అనంతరం మీడియాతో ఆమె మాట్లాడుతూ... నవరాత్రుల సందర్భంగా ప్రతి రోజు ఏదో ఒక జిల్లాలో అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటూ ముందుకు సాగుతున్నానని చెప్పారు. క్రమం తప్పకుండా తాను ఆలయాలను, హోమాలు జరిగే ప్రాంతాలను దర్శిస్తుంటానని... దీని వల్ల నెగెటివ్ ఎనర్జీ తొలగిపోతుందని, ప్రజలకు సేవ చేసేందుకు అవసరమైన పాజిటివ్ ఎనర్జీ వస్తుందని చెప్పారు. 

ఎక్కడైతే మనం పూజలు చేస్తామో అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని పెద్దలు చెపుతుంటారని వ్యాఖ్యానించారు. సినీ, రాజకీయ ప్రముఖులకు శత్రువులు ఉంటారని, దిష్టి ఎక్కువగా ఉంటుందని... దీంతో, నెగెటివ్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుందని... దీన్నుంచి బయటపడేందుకు దేవాలయాలను సందర్శించాలని తెలిపారు.
Roja
YSRCP
Vizag
Swaroopanandendra Saraswati

More Telugu News