Chandrababu: 13 ఏళ్ల వయసున్న బాలికలు విజయవాడలో గంజాయి తాగడం నివ్వెరపరిచింది: చంద్రబాబు

Chandrababu responds to girl students Ganja addiction in Vijayawada
  • పాఠశాల విద్యార్థినుల గంజాయి వాడకం
  • పత్రికలో కథనం
  • స్పందించిన చంద్రబాబు
  • ఎంతో ఆందోళన కలిగించిందని వెల్లడి
  • ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలని డిమాండ్
విజయవాడలో పాఠశాలకు వెళ్లే బాలికలు గంజాయి తాగినట్టు మీడియాలో వచ్చిన కథనంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. 13 ఏళ్ల వయసున్న బాలికలు విజయవాడలో గంజాయి తాగడం నివ్వెరపరిచిందని వెల్లడించారు. ఈ వార్త తనను ఎంతో ఆందోళనకు, ఆవేదనకు గురిచేసిందని తెలిపారు.

స్కూలు పిల్లల వరకు గంజాయి వచ్చేసిందంటే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థమవుతోందని పేర్కొన్నారు. తీవ్రమైన ఈ అంశంపై ప్రభుత్వ వ్యవస్థలు అత్యంత సీరియస్ గా దృష్టి పెట్టాలని, సమూలంగా గంజాయిని అరికట్టేలా సత్వర చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. 

రాజకీయ వేధింపుల కోసం పోలీసులను వాడడంలో మునిగిపోయిన ప్రభుత్వం... యువత, విద్యార్థుల జీవితాలను గాలికి వదిలెయ్యడం క్షమించరాని నేరం అని స్పష్టం చేశారు. కొత్త సమస్యలు, సవాళ్ల నేపథ్యంలో తల్లిదండ్రులు కూడా నిత్యం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోందని చంద్రబాబు తెలిపారు.
Chandrababu
Girl Students
Ganja
Vijayawada

More Telugu News