కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఖర్గేకు ఖాయమైనట్టేనా?
- రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఖర్గే రాజీనామా
- రాజీనామాను సోనియా గాంధీకి పంపిన ఖర్గే
- పార్టీని నడిపే బాధ్యత తీసుకునేందుకే నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం
మరోవైపు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు శుక్రవారం మల్లికార్జున్ ఖర్గే, శశిథరూర్, కేఎన్ త్రిపాఠి నామినేషన్లు దాఖలు చేశారు. అయితే, ఖర్గే అభ్యర్థిత్వానికి తాము మద్దతు ఇస్తామని జి-23 నేతలు పృథ్వీరాజ్ చవాన్, మనీశ్ తివారీ, భూపిందర్ హుడా ప్రకటించారు. అదే సమయంలో కాంగ్రెస్ అత్యున్నత పదవికి పోటీలో ఉన్న దిగ్విజయ సింగ్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేయనని చివరి నిమిషంలో ప్రకటించారు. తన బదులు సీనియర్ మల్లికార్జున్ ఖర్గే అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తానని ప్రకటించారు.