బుమ్రా స్థానంలో మొహమ్మద్ సిరాజ్ కు చోటు.. మెడికల్ టీమ్ పర్యవేక్షణలో బుమ్రా

Mohammed Siraj replaces injured Jasprit Bumrah
  • వెన్ను గాయంతో జట్టుకు దూరమైన బుమ్రా
  • దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ కు సిరాజ్ ఎంపిక
  • సౌతాఫ్రికాతో ఆదివారం రెండో మ్యాచ్
టీ20 ప్రపంచకప్ కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. పేసర్ జస్ప్రీత్ బుమ్రా వెన్ను గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సిరీస్ లో మిగిలిన రెండు టీ20లతో పాటు వచ్చే నెల ఆస్ట్రేలియాతో జరిగే టీ20 ప్రపంచ కప్ కు ఆయనను దూరం పెట్టారు. 

ఇక బుమ్రా స్థానంలో హైదరాబాదీ మొహమ్మద్ సిరాజ్ ను సెలెక్టర్లు ఎంపిక చేశారు. దక్షిణాఫ్రికాతో మిగిలిన రెండు టీ20లకు సిరాజ్ ను ఎంపిక చేసినట్టు ఒక ప్రకటనలో బీసీసీఐ తెలిపింది. బుమ్రా ప్రస్తుతం బీసీసీఐ మెడికల్ టీమ్ పర్యవేక్షణలో ఉన్నాడని పేర్కొంది. 

మరోవైపు 3 టీ20ల సిరీస్ లో టీమిండియా 1-0తో లీడ్ లో ఉంది. తిరువనంతపురంలో జరిగిన తొలి మ్యాచ్ లో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందింది. రెండో మ్యాచ్ ఆదివారం నాడు గువాహటిలో జరుగుతుంది.
Go Back to Shorts
Jasprit Bumrah
Mohammed Siraj
Team India

More Telugu News