నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్.. షెడ్యూల్ ఇదే
- గం.11.30కి యాదాద్రి చేరుకోనున్న సీఎం
- స్వామి వారిని దర్శించుకోనున్న సీఎం దంపతులు
- స్వర్ణతాపడానికి కిలో 16 తులాల బంగారం సమర్పణ
- మధ్యాహ్నం గం. 3.30కి హైదరాబాద్ తిరుగు ప్రయాణం
అక్కడి నుంచి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్తో పాటు మరికొందరు స్వర్ణతాపడానికి బంగారం విరాళంగా అందజేయనున్నట్లు యాదాద్రి ఈవో ఎన్. గీత తెలిపారు. మధ్యాహ్నం ఆలయంలో భోజనం చేసిన తర్వాత గం. 3.30కి సీఎం కేసీఆర్ హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అవుతారు. ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ యాదాద్రికి వెళ్లడం ఇది 21వ సారి కావడం గమనార్హం.
కాగా, జాతీయ పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్న సీఎం కేసీఆర్.. యాదాద్రి పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే ముందు నారసింహుడిని దర్శించుకోవాలని సీఎం భావిస్తున్నారని తెలుస్తోంది. దసరా పండుగను పురస్కరించుకొని అక్టోబర్ 5న జాతీయ పార్టీని ప్రకటించే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అదే రోజు టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశంతో పాటు పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం కాబోతుండటం ఇందుకు బలం చేకూరుస్తోంది.