విజయవాడ టూ బెంగళూరు వయా కడప!... జగన్ ప్రతిపాదిత కొత్త రూట్‌కు ఓకే చెప్పిన గడ్కరీ!
- కొత్త రహదారితో విజయవాడ, బెంగళూరుల మధ్య తగ్గనున్న 75 కిలోమీటర్ల దూరం
- 342 కిలోమీటర్ల రహదారికి రూ.13,600 కోట్లను కేటాయించిన కేంద్రం
- రహదారికి ఆమోదం తెలిపిన గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపిన కొఠారు అబ్బయ్య చౌదరి
విజయవాడ నుంచి కడప మీదుగా బెంగళూరుకు ఏర్పాటు కానున్న నూతన రహదారి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని తన ట్వీట్లో అబ్బయ్య చౌదరి వెల్లడించారు. ఈ కొత్త రహదారి అందుబాటులోకి వస్తే... విజయవాడ, బెంగళూరుల మధ్య దూరం 75 కిలోమీటర్ల మేర తగ్గుతుందని తెలిపారు. మొత్తం 342 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ రహదారి నిర్మాణానికి రూ.13,600 కోట్ల నిధులు కేటాయింపునకు అనుమతి తెలిపిన కేంద్ర మంత్రి గడ్కరీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.