హైదరాబాద్ మీదుగా తిరుపతికి ప్రత్యేక విమానంలో బయలుదేరిన సీఎం జగన్
- ప్రత్యేక విమానంలో బయలుదేరిన జగన్ దంపతులు
- బేగంపేటలో విమానం దిగిపోనున్న వైఎస్ భారతి
- అక్కడి నుంచి రేణిగుంటకు వెళ్లనున్న జగన్
- రేపు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న ఏపీ సీఎం
జగన్‌తో ప్రత్యేక విమానంలో బయలుదేరిన భారతి హైదరాబాద్‌లో దిగనున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్టులో జగన్ ప్రత్యేక విమానం ల్యాండ్ కానుంది. బేగంపేటలో భారతిని దించిన తర్వాత జగన్ అదే విమానంలో రేణిగుంట చేరుకుంటారు. తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు జగన్ తిరుమల వెళుతున్న సంగతి తెలిసిందే.