Andhra Pradesh: హైద‌రాబాద్ మీదుగా తిరుప‌తికి ప్ర‌త్యేక విమానంలో బ‌య‌లుదేరిన సీఎం జ‌గ‌న్

ap cm jagan starts form gannavaram to renigunta via hyderabad in special flight
  • ప్రత్యేక విమానంలో బ‌య‌లుదేరిన జ‌గ‌న్ దంప‌తులు
  • బేగంపేట‌లో విమానం దిగిపోనున్న వైఎస్ భార‌తి
  • అక్క‌డి నుంచి రేణిగుంట‌కు వెళ్ల‌నున్న జ‌గ‌న్‌
  • రేపు శ్రీవారికి ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించ‌నున్న ఏపీ సీఎం
ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి తిరుప‌తి ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లుదేరారు. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం తాడేప‌ల్లిలోని త‌న నివాసం నుంచి త‌న భార్య భార‌తితో క‌లిసి గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్టుకు చేరుకున్న జ‌గ‌న్‌... అక్క‌డ భార్య‌తో క‌లిసి ప్ర‌త్యేక విమానం ఎక్కారు. జ‌గ‌న్ ఎక్కిన విమానం నేరుగా తిరుప‌తి స‌మీపంలోని రేణిగుంట‌కు కాకుండా హైద‌రాబాద్ మీదుగా రేణిగుంట చేరుకోనుంది. 

జ‌గ‌న్‌తో ప్ర‌త్యేక విమానంలో బ‌య‌లుదేరిన భార‌తి హైద‌రాబాద్‌లో దిగ‌నున్నారు. ఈ మేర‌కు హైద‌రాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్టులో జ‌గ‌న్ ప్ర‌త్యేక విమానం ల్యాండ్ కానుంది. బేగంపేట‌లో భార‌తిని దించిన త‌ర్వాత జ‌గ‌న్ అదే విమానంలో రేణిగుంట చేరుకుంటారు. తిరుమ‌ల బ్రహ్మోత్స‌వాల్లో భాగంగా శ్రీవారికి ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించేందుకు జ‌గ‌న్ తిరుమ‌ల వెళుతున్న సంగ‌తి తెలిసిందే.
Andhra Pradesh
Tirumala
YSRCP
YS Jagan
Gannavaram
Begumpet
Renigunta
YS Bharathi

More Telugu News