Sensex: ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

markets ends in losses
  • ఈరోజు ఆద్యంతం లాభనష్టాల్లో ఊగిసలాడిన మార్కెట్లు
  • 37 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 8 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ఈరోజు ఆద్యంతం లాభ, నష్టాల మధ్య ఊగిసలాడిన సూచీలు చివరకు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. తద్వారా వరుసగా ఐదో సెషన్ ను నష్టాల్లో ముగించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 37 పాయింట్లు నష్టపోయి 57,107కు పడిపోయింది. నిఫ్టీ 8 పాయింట్లు కోల్పోయి 17,007 వద్ద స్థిరపడింది. 


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.18%), పవర్ గ్రిడ్ కొర్పొరేషన్ (2.01%), ఇన్ఫోసిస్ (1.38%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (1.29%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.25%). 

టాప్ లూజర్స్:
టాటా స్టీల్ (-2.25%), టైటాన్ (-1.79%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.39%), కోటక్ బ్యాంక్ (-1.10%), టెక్ మహీంద్రా (-1.08%).

  • Loading...

More Telugu News