Rahul Gandhi: మహిళలు భద్రంగా ఉన్నప్పుడే భారత్ పురోగమిస్తుంది: రాహుల్ గాంధీ

Rahul Gandhi opines that India will progress when women are safe
  • ఉత్తరాఖండ్ లో లేడీ రిసెప్షనిస్టు హత్య
  • బీజేపీ నేత కుమారుడి అరెస్ట్
  • మొరాదాబాద్ లో నగ్నంగా నడుచుకుంటూ వెళ్లిన అత్యాచార బాధితురాలు
  • ఈ ఘటనలు దిగ్భ్రాంతికి గురిచేశాయన్న రాహుల్ గాంధీ
ఉత్తరాఖండ్ లో బీజేపీ నేత కుమారుడు ఓ రిసెప్షనిస్టును హత్య చేయడం, యూపీలోని మొరాదాబాద్ లో అత్యాచారానికి గురైన యువతి నగ్నంగా నడుచుకుంటూ వెళ్లిన ఘటనలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

మహిళలు సురక్షితంగా ఉన్నప్పుడే భారత్ అభివృద్ధి పథంలో పయనిస్తుందని స్పష్టం చేశారు. ఉత్తరాఖండ్, మొరాదాబాద్ లో అమ్మాయిల పట్ల జరిగిన ఈ ఘటనలు ప్రతి ఒక్కరినీ నివ్వెరపరిచాయని పేర్కొన్నారు. భారత్ జోడో యాత్రలో తాను ఎంతోమంది ప్రతిభావంతులైన బాలికలను, యువతులను కలుస్తున్నానని, వారి ఆలోచనలను వింటున్నానని తెలిపారు. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టం.... వారు భద్రంగా ఉన్నప్పుడే దేశం ముందంజ వేస్తుంది అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. 

ఉత్తరాఖండ్ లో ఓ బీజేపీ నేత కుమారుడు, మరో ఇద్దరు రిసార్ట్ ఉద్యోగులు లేడీ రిసెప్షనిస్ట్ హత్యలో పాలుపంచుకోవడం తెలిసిందే. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

ఇక యూపీలోని మొరాదాబాద్ లో అత్యాచార బాధితురాలు వంటిపై దుస్తుల్లేని స్థితిలో నడుచుకుంటూ వెళుతున్న సీసీటీవీ ఫుటేజి తాలూకు వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
Rahul Gandhi
Women
India
Congress

More Telugu News