Nara Lokesh: ఐఏఎస్ లను తండ్రి జైలుకు తీసుకెళ్లాడు.. ఐపీఎస్ లను జగన్ జైలుపాలు చేయబోతున్నాడు: నారా లోకేశ్

IPS officers may go to jail due to Jagan says Nara Lokesh
  • కొందరు అధికారులు జగన్ ట్రాప్ లో పడి కెరియర్ ని నాశనం చేసుకుంటున్నారన్న లోకేశ్ 
  • 41ఏ నోటీసులు ఇవ్వకుండానే జర్నలిస్ట్ అంకబాబును అరెస్ట్ చేశారని విమర్శ 
  • కోర్టు మొట్టికాయలు వేస్తున్నా అధికారుల తీరు మారడం లేదని వ్యాఖ్య 
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి జగన్ లపై టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. తండ్రి అధికారంలో ఉన్నప్పుడు ఐఏఎస్ అధికారులను జైలుకు తీసుకెళ్లాడని అన్నారు. తన హయాంలో ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్ లు సహా పలువురు పోలీస్ అధికారులను జగన్ జైలు పాలు చెయ్యబోతున్నాడని చెప్పారు. కొంతమంది అధికారులు తాత్కాలిక ప్రయోజనాల కోసం జగన్ రెడ్డి ట్రాప్ లో పడి కెరియర్ ని నాశనం చేసుకుంటున్నారని అన్నారు. 

41ఏ నోటీసులు ఇవ్వకుండా జర్నలిస్ట్ అంకబాబు గారిని ఎందుకు అరెస్ట్ చేశారంటూ సీఐడీ అధికారులపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసిందని చెప్పారు. పదే పదే కోర్టు మొట్టికాయలు వేస్తున్నా అధికారుల తీరు మారడం లేదని అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
Nara Lokesh
Telugudesam
Jagan
YSRCP

More Telugu News