YSRCP: టీడీపీ పాలన, కరోనా కారణంగానే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతింది: బుగ్గన
ఏపీ ఆర్థిక నిర్వహణపై కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిందంటూ విపక్ష టీడీపీ చేసిన ఆరోపణలను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఖండించారు. ఈ మేరకు టీడీపీ చేసిన ఆరోపణలకు సంబంధించి అంశాల వారీగా శుక్రవారం ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. కాగ్ అభ్యంతరాలు లేవనెత్తిన మాట వాస్తవమేనన్న బుగ్గన... ఆ అభ్యంతరాలన్నీ విధానపరమైనవేనని తెలిపారు.