ఉద్ధవ్ థాకరేతో భేటీ అయిన గౌతమ్ అదానీ
- మోదీ, అమిత్ షాలకు అత్యంత సన్నిహితుడు అదానీ
- శివసేనను చీల్చి మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ
- థాకరే, అదానీలు ఏం మాట్లాడుకున్నారనే విషయంపై రాని క్లారిటీ
మరోవైపు, శివసేనను చీల్చి... ఆ పార్టీ రెబెల్ నేత ఏక్ నాథ్ షిండే నేతృత్వంలో మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వాన్ని బీజేపీ ఏర్పాటు చేసిన సంగతి కూడా విదితమే. ఈ నేపథ్యంలో, థాకరేతో అదానీ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. థాకరేతో అదానీ సమావేశమైన విషయాన్ని అదానీ గ్రూప్ కు చెందిన ఒక ఉన్నతాధికారి తెలిపారు. అయితే, వీరిద్దరూ ఏయే అంశాలపై చర్చించారనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు.