Pawan Kalyan: పోలీసు వ్యవస్థను రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నారు: పవన్ కల్యాణ్

Pawan Kalyan criticizes AP Govt
  • పోలీసుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్న పవన్
  • భత్యాలు, లోన్లు ఇవ్వడంలేదని ఆరోపణ
  • పోలీసు భద్రతా నిధి ఏంచేశారన్న జనసేనాని
రాష్ట్రంలో పోలీసులను రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆరోపించారు. కానీ, పోలీసుల సమస్యలపై వైసీపీ ప్రభుత్వం దృష్టి సారించడంలేదని పేర్కొన్నారు. పోలీసులకు భత్యాలు, లోన్లు ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. పోలీసుల భద్రత పేరుతో జీతం నుంచి తీసుకున్న సొమ్ము ఏంచేశారని ప్రభుత్వాన్ని నిలదీశారు. పోలీసుల భద్రతానిధిని ఏంచేశారో పాలకులు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

పోలీసుల టీఏలు 14 నెలలుగా బకాయిలు ఉన్నాయని పవన్ కల్యాణ్ అన్నారు. సమస్యలు పరిష్కరించాలని కోరిన చిరుద్యోగులకు వేధింపులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నంద్యాలలో కానిస్టేబుల్ హత్య కేసులో ఎలాంటి పురోగతి లేదని విమర్శించారు. 
Pawan Kalyan
Police
AP Govt
Janasena
YSRCP
Andhra Pradesh

More Telugu News