రాష్ట్రంలో ఎన్టీఆర్, వైఎస్సార్, జగన్ లే ట్రెండ్ సెట్టర్లు: వైసీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై వైసీపీ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలో జగన్ ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ, అభివృద్ధి పథకాలను మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మరే రాష్ట్రంలో కూడా అమలు చేయలేదని చెప్పారు. ప్రజల కష్టాలను తీర్చడం, రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే దానిపై జగన్ ఎంతో ఆలోచించారని అన్నారు.

ఏపీలో ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్ మాత్రమే ట్రెండ్ సెట్టర్లు అని చెప్పారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలకు అన్నీ కష్టాలేనని చెప్పారు. పేదలు బతుకుదెరువు కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లకూడదని, ఆత్మహత్యలకు పాల్పడకూడదని, పేదల పిల్లలు బాగా చదువుకోవాలని జగన్ ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చారని అన్నారు. శాసనసభలో విద్య, వైద్యం, నాడు-నేడు అంశంపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.


More Telugu News