Telangana: తెలంగాణ‌లో ఎస్సీ, ఎస్టీ రిజ‌ర్వ్ నియోజ‌క‌వ‌ర్గాల‌కు క‌న్వీన‌ర్ల‌ను ప్ర‌క‌టించిన బీజేపీ

  • తెలంగాణ‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఏడాదికిపైగా స‌మ‌యం
  • అప్పుడే ఎన్నిక‌ల‌పై దృష్టి సారించిన 3 ప్ర‌ధాన పార్టీలు
  • రాష్ట్రంలో 31 ఎస్సీ, ఎస్టీ రిజ‌ర్వ్‌డ్ నియోజ‌కవ‌ర్గాలు
  • వాటికి క‌న్వీన‌ర్లు, జాయింట్ క‌న్వీన‌ర్ల‌ను నియ‌మించిన బీజేపీ
ts bjp rfeleases conveners and joint conveners for reserved constituencies

తెలంగాణ‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఇంకా ఏడాదికిపైగా స‌మ‌యం ఉన్నా... అప్పుడే రాజ‌కీయాలు వేడెక్కాయి. వ‌రుస‌గా మూడోసారి అధికారం చేప‌ట్టాల‌ని టీఆర్ఎస్ వ్యూహాలు ర‌చిస్తుండ‌గా.. కేసీఆర్ స‌ర్కారును ఎలాగైనా గ‌ద్దె దించాల‌న్న సంక‌ల్పంతో బీజేపీ ప్ర‌ణాళిక‌లు వేస్తోంది. ఇక రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ కూడా విజ‌యకాంక్ష‌తో దూకుడు పెంచింది.

ఈ నేప‌థ్యంలో బీజేపీ సోమ‌వారం ఓ కీల‌క నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించింది. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల‌కు కేటాయించిన రిజ‌ర్వ్‌డ్ స్థానాలపై దృష్టి సారించింది. మొత్తంగా ఎస్సీ, ఎస్టీ రిజ‌ర్వ్‌డ్ నియోజ‌క‌వ‌ర్గాలు 31 ఉండ‌గా... వాటికి క‌న్వీన‌ర్లు, జాయింట్ క‌న్వీన‌ర్ల‌ను నియ‌మించింది. ఈ మేర‌కు సోమ‌వారం జాబితాను విడుద‌ల చేసింది.

More Telugu News